Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీబీఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోం.. హైకోర్టుకు వెళ్లండి : సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురు

మద్యం పాలసీలో అరెస్టైన డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురైంది. సీబీఐ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. సిసోడియా బెయిల్ పిటిషన్ ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఢిల్లీలో వున్నంత మాత్రాన సుప్రీం కోర్టును ఆశ్రయించడం సరికాదని, హైకోర్టుకు వెళ్లండని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.సీబీఐ ఛార్జిషీట్ లో సిసోడియా పేరు లేకున్నా… ఆయన్ను అరెస్ట్ చేయడం అక్రమమని సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. దర్యాప్తుకు సహకరించడం లేదని సీబీఐ చేస్తున్న ఆరోపణలు కేవలం సాకుమ మాత్రమే అని పేర్కొన్నారు.

 

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ… సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోరిన విజ్ఖప్తికి కోర్టు ఓకే చెప్పింది. దీంతో మార్చి 4 వరకూ సిసోడియాను కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. మొదట్లో సీబీఐ కస్టడీకి ఇచ్చే విషయంలో తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటికే మళ్లీ కోర్టు తీర్పు వెలువరించింది.

 

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ సోమవారం నాడు కోర్టులో హాజరుపరిచింది. సిసోడియా తాము అడిగిన ప్రశ్నలను పూర్తిగా దాటేస్తున్నారని, సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే… ఆయనను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే… సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Posts

Latest News Updates