సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురి జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ పంకజ్ మిట్టల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాలు సుప్రీం జడ్జీలుగా బాధ్యతలు స్వీకరించారు. వీరందరితో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 32కు చేరుకుంది.గత యేడాది డిసెంబర్ 13 న కొలీజియం పంపిన సిఫార్సులకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో కొత్తగా ఐదుగురు జడ్జీలు నియమితులయ్యారు. ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య సీజేఐతో కలిసి 32 కి చేరింది.
