ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబేర్ కు సుప్రీం కోర్టు నేడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ ఆదేశించింది. ఇందుకు గాను 20 వేల పూచీకత్తు కట్టాలని ఆదేశించింది. పలు చోట్ల నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టేయాలంటూ జుబేర్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ లను క్లబ్ చేయాలని, వాటిని ఢిల్లీ పోలీసులను సుప్రీం ఆదేశించింది.
అలాగే జుబేర్ ను ట్వీట్ చేయకుండా నిషేధం విధించాలన్న యూపీ ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీం స్పందించింది. జర్నలిస్టును రాయవద్దని చెప్పడమంటే.. ఓ న్యాయవాదిని వాదించడం ఆపేయమని చెప్పినట్లే అవుతుందని సుప్రీం పోల్చింది. ఇక.. ఆయన చేసే ట్వీట్లకు ఆయనే బాధ్యత వహించాలని కూడా సుప్రీం సూచించింది. అయితే.. వాటి విషయంలో చట్టపరమైన నిబంధనలు మాత్రం కచ్చితంగా వర్తిస్తాయని సుప్రీం తేల్చి చెప్పింది.