భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి సస్పెండయిన నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. అత్యున్నత న్యాయస్థానం ‘లక్ష్మణ రేఖ’ను దాటిందని, తక్షణమే అత్యవసర దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా తమ కర్తవ్యాలను నిర్వహించినపుడు మాత్రమే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ విశ్రాంత న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లు, రక్షణ దళాల మాజీ అధికారులు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘‘అన్ని వ్యవస్థలు తమ కర్తవ్యాలను రాజ్యాంగానికి అనుగుణంగా నిర్వహించినంత వరకు మాత్రమే ఏ దేశంలోని ప్రజాస్వామ్యమైనా మనుగడ సాగిస్తుందని ఆసక్తిగల, ప్రభావిత పౌరులుగా మేము విశ్వసిస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఇటీవల చేసిన వ్యాఖ్యలు ‘లక్ష్మణ రేఖ’ను దాటాయి, బహిరంగ లేఖను విడుదల చేసే విధంగా మమ్మల్ని ఒత్తిడి చేశాయి’’ అని పేర్కొన్నారు.