ఒడిశా తీరంలో గూఢచర్య పావురం కనిపించింది. దాని కాళ్లకు ఓ కెమెరా, మైక్రోచిప్ కూడా వుంది. ఒడిశా సాగర తీరంలో ఈ పావురం తెగ చెక్కర్లు కొడుతోంది. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే పోలీసులకు చెప్పి, దానిని వారికి అందజేశారు. అయితే… గూఢచర్యం కోసమే ఈ పావురాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే… చైనా నుంచే ఈ పావురం వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు పావురాన్ని పరీక్షించిన పోలీసులు..పావురం రెక్కపై కోడ్ నంబర్‌తో మెసేజ్ ఉన్నట్లు గుర్తించారు. పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని.. దాని కాళ్లకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం తీసుకుంటామని జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ తెలిపారు.