ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు చేయడం లేదని, ప్రతి యేడాది కూడా మొక్కుబడిగా పూజలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పూజల విషయంలో సంతోషంగా లేనని చెప్పినా… మారడం లేదని అన్నారు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా పూజలు సక్రమంగా చేయాలని సూచించారు. పూజలు సక్రమంగా జరగడం లేదనే వర్షాలు కురిపిస్తున్నానని, నా గురించి తెలియాలనే అన్నారు. ప్రతి యేడాది ఇష్టానుసారంగా తన రూపాన్ని మారుస్తున్నారని, ఇంకా ఎన్ని రూపాలు మారుస్తారు? అంటూ అన్నారు. ఇక… దొంగలు దోచినట్లు తన సొమ్మునే కాజేస్తున్నారని స్వర్ణలత రంగం వినిపించారు.