బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా స్వాతిముత్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 13న విడుదల కావాల్సి ఉంది. అయితే.. చిత్ర యూనిట్ వాయిదా వేసింది. తాజాగా… ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రకటించింది. దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కొత్త రిలీజ్ డేట్ తో వున్న పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.
పరిశ్రమలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వున్నాయని, థియేటర్ కు ఎప్పటిలాగా ప్రేక్షకులు రావడం లేదని నిర్మాత నాగవంశీ గతంలో పేర్కొన్నారు. మిగతా సినిమాలకు ఇబ్బంది కలిగించకూడదని విడుదల వాయిదా వేస్తున్నాం. ఇది మాకు ఇబ్బంది కలిగించినా తప్పడం లేదు అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.
https://twitter.com/manastarsdotcom/status/1557242879894253568?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1557242879894253568%7Ctwgr%5E93aa74ca93a5f614573abc31558ea098c342656d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2Fbellamkonda-ganesh-swathimutyam-new-release-date-release