గణేశ్,వర్ష బొల్లమ్మ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 న రిలీజ్ కావాలి. కానీ… ప్రస్తుత కారణాలు, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామన్నారు. ఈ నిర్ణయం తమకు బాధ కలిగించేదే అయినా… తప్పడం లేదన్నారు. అయితే.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయని, రిలీజ్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలనుకున్నాం కానీ… ప్రస్తుత పరిస్థితులు అలా వున్నాయన్నారు. పరిశ్రమ గురించి ఆలోచించే వెనక్కి తగ్గామన్నారు. మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత బాగోలేదని, ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు. ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించామని నిర్మాత తెలిపారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.
గణేశ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లు. నరేశ్, రావు రమేశ్, సురేఖ వాణి, సప్తగిరి, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, దివ్య శ్రీపాద ఇందులో నటిస్తున్నారు. సంగీతం, మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ, సూర్య, ఎడిటర్ నవీన్ నూలి