బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని వస్తే ముఖ్యమంత్రి తప్పనిసరిగా స్వాగతం పలకాలనేది ఎక్కడా లేదన్నారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలని అన్నారు. అనైతిక పొత్తులతో ప్రభుత్వాలను పడగొట్టే పనిలో బీజేపీ నిమగ్నమైందని విమర్శించారు. కేంద్రంలో ముందస్తుకు రెడీ అయితే.. రాష్ట్రంలో మేము కూడా రెడీయేనని సంచలన ప్రకటన చేశారు.
అంతేకాకుండా మోదీ తన ట్విట్టర్ లో హైదరాబాద్ సిటీని డైనమిక్ సిటీ అన్నందుకు మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ని డైనమిక్ సిటీగా గుర్తించినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని తలసాని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Thank you Hon’ble Prime Minister Sri @narendramodi Ji for recognising Hyderabad as dynamic city which is being developed under the able leadership of Hon’ble Chief Minister Sri KCR Garu. pic.twitter.com/CBNEmf8sST
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 2, 2022