అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్ ప్యాక్ వితరణ అన్న కార్యక్రమాన్ని తానా ప్రారంభించింది. డల్లాస్ లో తానా ప్రాంతీయ ప్రతినిధి సతీశ్ కొమ్మన, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరిగింది. డల్లాస్ లోని H.E.B పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రవాస తెలుగు వారితో కలిసి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తానా ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇతరులతోనూ కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా వున్నామని తానా పేర్కొంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు సహాయ, సహకారాలు అందిస్తున్న వారికి తానా ప్రతినిధులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.