వసంత్ సమీర్ హీరోగా హెచ్ అండ్ హెచ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్న థ్రిల్లర్ చిత్రం టాక్సీ. దీనికి బిక్కీ విజయ్ కుమార్ నిర్మాత. ఈ మూవీ ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రిలీజ్ చేశారు. 1 నిమిషం 59 సెకండ్ల నిడివితో ఈ సినిమా ట్రైలర్ వుంది. ఈ ట్రైలర్ అద్భుతంగా వుందని క్రిష్ తెగ మెచ్చుకున్నారు.
సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. యూత్ కు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యభరితమైన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతోంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి, అల్మాస్ మోటీవాల, సూర్య శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు. రాబిన్ సంగీతం అందిస్తున్నారు.