గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ సత్తా చాటింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల్లో టీడీపీ తన పట్టును నిలుపుకుంది. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన గెలుపును అధికారులు ప్రకటించారు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 94,510 మ్యాజిక్ ఫిగర్ సాధించారు.
టీడీపీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ గారి యువగళం పాదయాత్ర ప్రభావమే అని ప్రజలు అంటున్నారు. జగన్ రెడ్డి భయపడినట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ గారి దెబ్బ వైసీపీకి గట్టిగానే తగిలిందన్నమాట pic.twitter.com/jolKdN1TJU
— Telugu Desam Party (@JaiTDP) March 17, 2023
మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో కంచర్ల శ్రీకాంత్ విజయంపై తెలుగు దేశం పార్టీ ట్వీట్ చేసింది. ‘‘టీడీపీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు రాగా.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి.