ఏపీలో గత మూడేళ్లుగా అరాచక పాలన నడుస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలేనని, ప్రశ్నించిన వారిని కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఇంటికొకరు తరలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. మూడేళ్లలో 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ప్రతి ఊరిలోనూ పాఠశ:ాల వుండడం ఆ ఊరి మక్కని, ఐదేళ్ల వయస్సున్న పిల్లలు మూడు కిలోమీటర్ల దూరం నడిచి, పాఠశాలలకు వెళ్లమనడం దుర్మార్గం అని మండిపడ్డారు.
హేతుబద్ధీకరణ పేరిట సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నరాని, దీనిపై ప్రజలు ఉద్యమించాలని సూచించారు. రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతులను ఇబ్బంది పెట్టడమేనని మండిపడ్డారు. దీనిని తాము అంగీకరించమని స్పష్టం చేశారు. అధికారం కోసం రాష్ట్రమంతా జగన్ తిరిగారని, ఇప్పుడేమో అన్ని పన్నుల పేరుతో ప్రజలను పిడిగుద్దులు గుద్దుతున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం పేరుతో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బందులు పెడుతోందని చంద్రబాబు ఆరోపించారు. వివిధ రకాల పేర్లతో మద్యం వ్యాపారం చేస్తున్నారని, ఈ మద్యం తాగితే ప్రజల ఆరోగ్యాలు పోతాయని అన్నారు. లేబొరేటరీలో పరీక్షలు చేస్తే అందులో కెమికల్స్ వున్నాయన్న విషయం రుజువైందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారని, ఇప్పుడు దాని ఊసే లేదని చంద్రబాబు మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వచ్చి, ప్రత్యేక హోదా తెస్తానని అన్నారని ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.