టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానాల వల్లే తీవ్ర నష్టం జరుగుతోందని ఆ లేఖలో దుయ్యబట్గారు. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు సాంకేతికంగా నష్టం జరుగుతోందని ఆరోపించారు.
ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం పట్ల వైసీపీ సర్కార్ ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదని, ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులు పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులను రాష్ట్ర సర్కార్ ఇతరులకు అప్పగించిందని చంద్రబాబు లేఖలో కేంద్ర మంత్రికి తెలియజేశారు. కేంద్రం వెంటనే చొరవ తీసుకొని, ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు కోరారు.