ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని, అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకొని అక్రమ విజయాలు సాధించిన వైసీపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని అన్నారు. పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చి దొంగ ఓట్లు వేసినా, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు ఒడ్డి విజయం సాధించారని ప్రశంసించారు.
34 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గా గెలిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు ( కు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు , కేడర్ తన గెలుపునకు విశేష కృషి చేశారన్నారు. అందరి సహకారంతో 30 రోజుల్లో 34 నియోజకవర్గాల్లో ప్రచారం చేసినట్లు తెలిపారు. తన విద్యార్థులు గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి పనిచేశారన్నారు. తనకు సహకరించిన మిత్రులను అనేక విధాలుగా వేధించారన్నారు. తన విజయానికి సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.