స్పైస్ జెట్ విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడం ఈ మధ్య షాకింగ్ కలిగిస్తోంది. మొన్నటికి మొన్నే రెండు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కార్గో విమానంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో చైనాకు వెళ్లాల్సిన కార్గో కేన్సిల్ అయ్యింది. స్పైస్ జెట్ బోయింగ్ 737 కార్గో విమానం కోల్ కత్తా విమానాశ్రయం నుంచి చాంగ్ కింగ్ కు బయల్దేరింది.
టేకాఫ్ అయిన కాసేపటికే వెదర్ రాడార్ పనిచేయలేదు. ఈ విషయాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన పైలట్ కోల్ కత్తా వైపు మళ్లించారు. ఈ 18 రోజుల్లో ఇలాంటి సాంకేతిక సమస్యలు రావడం ఇది ఎనిమిదో సారి. దీంతో అటు విమానయాన సంస్థ, ఇటు ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.