సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తయారు చేసినా, నిల్వ వుంచుకున్నా… లక్ష రూపాయల జరిమానాలు విధించాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ప్లాస్టిక్ నిషేధం సరిగ్గా అమలు అయ్యేందుకు రాష్ట్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటెరీ, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్లతో ఈ కమిటీ వుంటుంది. వీటితో పాటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే తనిఖీలు కూడా నిర్వహించనున్నారు.
ఇక తయారీదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను జారీ చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేస్తూ దొరికిపోతే.. లక్ష ఫైన్ వేస్తారు. అలాగే క్యారీ బ్యాగులపై రిజిస్ట్రేషన్ నెంబర్ వేయకుంటే ఏకంగా 50 వేల జరిమానా కట్టాల్సి వుంటుంది. రెండో సారి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తూ పట్టుబడితే 2 లక్షల జరిమానా విధిస్తారు.