తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను గచ్చిబౌలి ఎఐజి ఆసుపత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అస్వస్థత విషయం తెలుసుకున్న కేసీఆర్ వెంటనే కవిత, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో కలిసి శోభను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడకానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని వైద్య పరీక్షల తర్వాత శోభ డిశ్చార్జ్ అవుతారని పార్టీ నేతలు అంటున్నారు.
