తెలంగాణ ఎంసెట్, పీజీ సెట్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 7 నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఆన్ లైన్ లో అప్లికేషన్స్ తీసుకోనున్నారు. అయితే.. లేట్ ఫీజుతో అయితే మే 2 వరకు తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 న హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మే 7 నుంచి 11 వరకూ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ నిర్వహణకు తెలంగాణలో 16 పరీక్షా జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో నిర్వహించనున్నారు. గత 3 సంవత్సరాలుగా ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వడం లేదని, ఈ సారి కూడా ఉండదని లింబాద్రి పేర్కొన్నారు. ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు ఇస్తామని, అందుకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందన్నారు.
ఇక… మే 29 నుంచి జూన్ 1 వరకూ పీజీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు. లేట్ ఫీతో మే 24 వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు. మే 21వ తేదీ నుండి ఆన్లైన్ లో హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే.. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, వరంగల్ లో మాత్రమే వుంటాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి పేర్కొన్నారు.