Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయండి.. పోలవరం అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ సర్కార్

పోలవరం అథారిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని ఈ లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టు గనక పూర్తైతే… భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు పొంచి వుందని తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ హెచ్చరించారు. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ వుంటే ముప్పు ఎక్కువగా వుంటుందని, ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక… ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ముప్పేనని ఆ లేఖలో వివరించారు. వీటన్నంటినీ పరిగణనలోకి తీసుకొని.. ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై మరింత అధ్యయనం చేయాలని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ కోరారు.

Related Posts

Latest News Updates