బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు హైకోర్టులో ఊరట లభించింది. జమునా హేచరీస్ కు సంబంధించిన భూమి విషయంలో ఆగస్ట్ 1 వ తేదీ వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా భూమి స్వాధీనానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని రెవిన్యూ ప్రత్యేక కార్యదర్శిని, మెదక్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో, మాసాయి పేట తహశీల్దార్ ను హైకోర్టు ఆదేశించింది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ ఆక్రమించుకుందని రెవిన్యూ అధికారులు నిర్థారించారు. దీని స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జమునా హేచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు పై విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.