ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సహా బీజేపీ అగ్రనేతలందరూ తెలంగాణ రుచులను చూడబోతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సమావేశాలకు వచ్చిన నేతలందరికీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ తెలంగాణ వెరైటీలను తినిపించనుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లికి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను రుచి చేయబోతున్నారు. ఈ వంటకాలన్నీ తెలంగాణ స్టైయిల్ లోనే వుంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. స్వీట్స్ తో పాటు దాదాపు 50 రకాల వంటకాలను తయారు చేయించారు.
స్పెషల్ మెనూ ఇదే…
చిక్కుడు కాయ టమోటా.. ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ, పచ్చి కొబ్బరి తురుము, ఫ్రై, బెండకాయ, కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమాట ఫ్రై, బీరకాయ, మిల్ మేకర్, మెంతికూర పెసర పప్పు, గంగలవాయిల కూర, మామిడి పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చి పులుసు, గోంగూర పచ్చడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం ఉండనున్నాయి.
ఇక బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలతో పాటు మరికొన్ని స్వీట్లు పెట్టనున్నారు. పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి తో వున్న స్పాక్స్ ను కూడా బీజేపీ నేతలకు రుచి చూపించనున్నారు.