బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఈ నెల 15 న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఈ విషయాన్ని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మరోవైపు సరిగ్గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారిస్తున్న రోజే… అధికార బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బండి సంజయ్ కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఢిల్లీలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణలోనూ నిరసనలు చేపట్టారు. బండి సంజయ్ వెంటనే కవితకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు, మహిళా నేతలు డిమాండ్ చేశారు.
