తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 90 శాతం ఉత్తర్ణీత నమోదైందని తెలిపారు. ఫలితాల్లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలవగా, నిర్మల్ రెండో స్థానం, సంగారెడ్డి మూడో స్థానం, హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. బాలురు 87.61 శాతం, బాలికల్లో 92.45 శాతం పాస్ అయ్యారు. ఆగస్టు 1 నుంచి 10 వరకూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.
ఉపాధ్యాయులను అభినందించిన మంత్రి
కరోనా సమయంలోనూ ఉపాధ్యాయులు బాగా కష్టపడ్డారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మెచ్చుకున్నారు. ఆ సమయంలోనూ అధికారులు, ఉపాధ్యాయులు బాగా చొరవ చూపించారని, వాట్సాప్ గ్రూపులు, వర్క్ షీట్ ద్వారా బాగా పని చేశారని కితాబు నిచ్చారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు రీకౌంటిగ్ అవకాశం వుంటుందని, అవసరమైతే రాసిన పరీక్ష పేపర్ల జిరాక్స్ లు కూడా ఇస్లామని మంత్రి ప్రకటించారు.