కేంద్రం 68 వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు కూడా చోటు సంపాదించుకున్నాయి. 3 తెలుగు సినిమాలకు 4 జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫొటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫొటో అవార్డు గెలుచుకుంది. ఒక చిన్న సినిమాకు జాతీయ అవార్డు దక్కడం విశేషమే. ఇక.. ఉత్తమ నటుడిగా అజయ్ దేవ్ గణ్ ఎంపికయ్యారు. ఈ సారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా… 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి.
ఇక..
ఉత్తమ నటులుగా సూర్య (సూరారై పోట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ)
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి
ఉత్తమ చిత్రం : సూరారై పోట్రు
ఉత్తమ దర్శకుడు : దివంగత సచ్చిదానందన్
ఉత్తమ సహాయ నటి : లక్ష్మీప్రియ చంద్రమౌళి
ఉత్తమ సహాయ నటుడు : బిజూ మేనన్
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : అయ్యప్పనుమ్ కోషియుమ్, రాజశేఖర్, మాఫియా శశి,
ఉత్తమ కొరియోగ్రఫీ : నాట్యం (తెలుగు) సంధ్యారాజు
ఉత్తమ గీత రచన : సైనా (హిందీ) మనోజ్ ముంతిషిర్
ఉత్తమ సంగీతం : అల వైకుంఠపురం (తెలుగు) తమన్
ఉత్తమ నేపథ్య సంగీతం : సూరారై పోట్రు జీవీ ప్రకాశ్ కుమార్
ఉత్తమ మేకప్ : నాట్యం (తెలుగు) టీవీ రాంబాబు
ఉత్తమ సంభాషణలు : మండేలా (తమిళం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : అవిజాత్రిక్ (బెంగాలీ) సుప్రతిమ్ భోల్
ఉత్తమ నేపథ్య గాయని : నన్ చ్చమ్మ (మలయాళం)
ఉత్తమ నేపథ్య గాయకుడు : వసంతరావు (మరాఠీ), రాహుల్ దేశపాండే)