కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన పిరకల రామకృష్ణ (42) మృతి చెందాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పురుషోత్తం రెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 16 న ఉదయం వాళ్ల మిత్రుడిని కలిసేందుకు ఈ ఇద్దరూ కారులో బయల్దేరారు.
ఒంటోరియా స్టేట్ మిసెస్ ఆగా గ్రామం దగ్గర వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. పురుషోత్తం రెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రామకృష్ణ భౌతికకాయాన్ని తరలించేందుకు అక్కడి ఎన్నారైలతో గ్రామస్థులు మంతనాలు జరుపుతున్నారు.