అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడిరది. హిమాలయ ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు. ముఖ్యంగా పహల్గామ్ నుంచి వెళ్లేవారికి అనుమతి ఇవ్వడం లేదని, దీంతో దాదాపు 3 వేల మందిని నున్యాన్ బేక్ క్యాంప్ వద్దే ఆపివేశామని పేర్కొన్నారు. ఇదే మార్గంలో మరో 4 వేల మంది బ్యాచ్‌ను రంబాన్ జిల్లా చాందర్‌కోటలో ఉన్న యాత్రి నివాస్‌లో నిలిపివేసినట్లు తెలిపారు. అయితే జమ్మూ నుంచి బాల్తాల్ మార్గంలో ఉన్న దాదాపు 2 వేల మందిని మాత్రం మంచులింగ దర్శనానికి అనుతించినట్లు అధికారులు వెల్లడిరచారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో హిమలింగ దర్శనానికి తాత్కాలికంగా భక్తులను అనుమతించడం లేదు.
