Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘టెన్త్ క్లాస్ డైరీస్’ రిలీజ్ వాయిదా..

హీరో శ్రీరామ్, హీరోయిన్ అవికా గోర్ జంటగా నిర్మిస్తున్న చిత్రం టెన్త్ క్లాస్ డైరీస్. అచ్యుత రామారావు, రవితేజ మన్యం కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గరుడ వేగ అంజి దర్శకత్వంలో రానుంది. అయితే.. ఈ సినిమా విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నే ఈ సినిమా విడుదల కావాల్సి వుంది.

అయితే.. జూన్ 24 ఇతరత్రా నాలుగైదు సినిమాల విడుదల వుండటంతో ఈ ప్లాన్ ను వాయిదా వేసుకున్నామని మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 24 కు బదులు జూలై 1 న రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు.

ఎవరు ఎంత చదువుకున్నా వారి అకాడమిక్ ఇయర్ లో టెన్త్ క్లాస్ అనేది మరిచిపోలేని అనుభూతి అని, అందుకే దీని నేపథ్యంగా ఈ సినిమా తీశామని నిర్మాత అచ్యుత రామారావు అన్నారు. కొద్ది మంది జీవితాల్లో జరిగిన వాస్తవాల ఆధారంగానే ఈ సినిమా రూపొందించామన్నారు. పదో తరగతి రోజుల్లోకి అందర్నీ తీసుకెళ్తుందని, అందరూ మళ్లీ టెన్త్ క్లాస్ కి కనెక్ట్ అవుతారని మేకర్స్ అన్నారు.

Related Posts

Latest News Updates