ముంబైలో మళ్లీ 26/11 తరహా ఉగ్రదాడులకు పాల్పడతామంటూ పోలీసులకు మెసేజ్ లు వచ్చాయి. ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబరుకు పాకిస్తాన్ కోడ్ ఉండడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 26/11 తరహా దాడులకు పాల్పడతామంటూ ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్స్ వాట్సాప్ నెంబర్ కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనిని అత్యంత సీరియస్ గా తీసుకుంటామని, లోతుగా విచారణ జరుపుతామని ముంబై పోలీస్ కమిషనర్ ప్రకటించారు. దీంతో…. ఈ మెసేజ్ కు సంబంధించి, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విరార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్ నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చింది. భారత్ లో ఆరుగురు వ్యక్తులు దాడి చేయడానికి ఇప్పటికే సిద్ధంగా వున్నారంటూ ఆ మెసేజ్ లో వుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నామని ముంబై పోలీసులు పేర్కొన్నారు.