RRR మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించిన సందర్భంగా TFCC చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో భేటీ అయ్యారు. శుభాకాంక్షలు తెలుపుతూ… బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించారు. నాటు నాటు పాటకి ఆస్కార్ రావడం ఎంతో ఆనందంగా వుందన్నారు. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ ఓ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
గతంలో ప్రధానిని కలిసినప్పుడు 4 నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నానని, కానీ తమ భేటీ 40 నిమిషాలు సాగిందని తెలిపారు. మొత్తం ప్రపంచం భారతదేశం వైపు ఎలా చూడాలి అనే దాని గురించి మేమిద్దరం చర్చించుకున్నామని పేర్కొన్నారు. మోదీ విజన్ కు నేను ఆశ్చర్యపోయానన్నారు. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని, దాన్ని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని ఆయన సూచించారు’’ అని విజయేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.