టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ( కేటీఆర్) పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన దివ్యాంగురాలైన చిత్రకారిణి స్వప్నిక ఆయనకు అపురూప కానుక అందించారు. చేతులు లేకపోయినా నోటీతో కేటీఆర్ చిత్ర పటాన్ని గీశారు. తనకు కేటీఆర్ అంటే ఎంతో అభిమానమని, ఆయన చేసే సేవా కార్యక్రమాలు తనకు స్ఫూర్తిగా నిలిచాయని ఆమె తెలిపారు. భవిష్యత్లో మంత్రి కేటీఆర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించిన ఆమె మంత్రికి హృదయాపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన స్వప్నిక తన చిన్నతనంలోనే విద్యుత్తు షాక్తో రెండు చేతులు కోల్పోయింది. అయినప్పటికీ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా నోటితోనే పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై, ఆడపిల్లల సమస్యలపై పెన్సిల్ స్కెచ్ల రూపంలో చిత్రాలు గీస్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు.