సాయి ధన్సిక, తేజ్ కూర పాటి అభినవ్ మేడిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం షికారు. కె.వి. ధీరజ్, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ అభి, తేజ, ధీరజ్ అందరూ బాగా చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఈ చిత్రంలో మంచి కథతో పాటు చక్కటి కామెడీ ఉంది అంది నటి సాయి ధన్సిక. నిర్మాత మాట్లాడుతూ అహల్య గురించి అందరికీ తెలుసు. ఈ షికారు కథ అలాంటిదే. ఈ చిత్రానికి సాయి ధన్సిక పాత్ర వెన్నుముక. కథని నడిపించింది ఆమే. ఈ సినిమా కచ్చితంగా అందరీ నచ్చుతుంది అన్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉందని కథానాయిక సాయిధన్సిక చెప్పింది. అందరికీ తెలిసిన కథే ఇది. అందరికీ నచ్చుతుంది అన్నారు పీఎస్‌ఆర్ కుమార్. ఈ చిత్రానికి హరికొలగాని దర్శకుడు. పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జి) నిర్మాత. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, డి.ఎస్.రావు, విశ్వకిరణ్ తదితరులు పాల్గొన్నారు.