భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు,.