బెంగాల్ లో ఉపాధ్యాయ నియామక అవినీతిలో సంబంధం వుందని మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ శనివారం అరెస్ట్ చేసింది. కోల్ కతాలోని తన నివాసంలో 26 గంటలకు పైగా ఈడీ ఆయన్ను ప్రశ్నించింది. చివరకు ఇవ్వాళ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. పార్థా ఛటర్జీ ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖలు నిర్వహిస్తున్నారు. అయినా… విద్యాశాఖలో కూడా అవినీతికి పాల్పడ్డారు. ఇక… పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో 20 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నగదు ఉపాధ్యాయ నియామక అవినీతికి సంబంధించినవేనని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక… మరోవైపు విద్యా మంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యతో పాటు మరికొందరి నివాసాలపైనా ఈడీ ఏక కాలంలో దాడులు నిర్వహించింది. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా వున్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన పి.కె. బందోపాధ్యాయ, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ ఇళ్లపై కూడా ఈడీ దాడులు నిర్వహించింది.