తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేవారు. దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ డిబేట్ లో మాట్లాడుతూ.. కాళీ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల కాళీ మాతకు విస్కీ సమర్పిస్తారని, మరి కొన్ని చోట్ల అది తప్పుగా చూస్తారని వ్యాఖ్యానించారు. అయితే ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే పూర్తి హక్కు వుంటుందని పేర్కొంది.
స్పందించిన టీఎంసీ…
ఎంపీ మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఆ ఎంపీ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయమని పార్టీ ఎప్పుడూ చెప్పదని, ఆమె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ పేర్కొన్నారు. మరోవైపు కాళీ మాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎంపీ మొయిత్రాపై ఆమె సొంత నియోజకవర్గం కృష్ణా నగర్ లో కేసు నమోదైంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి.