తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సినీ నిర్మాత బండ్ల గణేశ్ తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. మళ్లీ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ ను తిరిగి యాక్టివ్ చేసేందుకే రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో బండ్ల గణేశ్ రాజేంద్ర నగర్ నుంచి బరిలోకి దిగడానికి ఎంతో ఆసక్తి చూపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అనేక ఛానళ్లకు ఇంటర్ద్యూలు కూడా ఇచ్చారు. కానీ.. కాంగ్రెస్ సర్కార్ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఢీలా పడిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం లేదు.