డాలస్ లో తానా ఆధ్వర్యంలో ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి యోగా శిక్షణా కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా, ఆర్ధిక మాంధ్యంలో కొట్టిమిట్టడుతున్న తరుణంలో ప్రవాసంలో వున్న తెలుగువారి కోసం, ప్రస్తుత్తం వున్న ఓత్తిడులను అధిగమించడానికి, ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడంలో యోగా కార్యక్రమం దోహదపడుతుందని డాలస్ ప్రతినిధి సతీశ్ కొమ్మన పేర్కొన్నారు. తానా బృందం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పారు. యోగా వలన ఆరోగ్యంతో పాటు, మనోధైర్యం, రోగనిరోధక శక్తి వంటి పలుప్రయోజనాలు వున్నాయని తెలియజేసి, ట్రైనింగ్ ఇచ్చిన చుక్కపల్లి కిరణ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనర్ చుక్కపల్లి కిరణ్ ని ఘనంగా సన్మానించారు.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ ‘చుక్కపల్లి కిరణ్’ గారికి తానాతో మంచి అనుభందం వుందని, వారు ఇండియాలో థింక్ పేచె తో అరకు ప్రాంతంలోని గిరిజన ప్రజలకు చేస్తున్న సేవ చాలా గొప్పది అని చెప్పారు. కిరణ్ గారు ఈరోజు తానాతో యోగా కార్యక్రమం చేపట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి ముందు ముందు కూడ వారు గిరిజన ప్రాంతంలో చేస్తున్న సేవలో తానా చేయూతనిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ట్రైనర్ చుక్కపల్లి కిరణ్ మాట్లాడుతూ.. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ఋషులు, గురువులు ఈ యోగా అర్ట్ ఫాం ను సంరక్షిస్తూ, గుప్తంగా సాధన చేసి మన తరతరాలకు అందేలా చేశారుని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు గురు పరంపర వలన నాకు హిమాలయాల్లో గురువుల సహకారంతో యోగా నేర్చుకునే అవకాశం కలగడం, గురు మండల నుంచి మంచి గురువు దీవెనతో నేర్చుకోగలగడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కార్యవర్గ బృందం శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, రాజేష్ అడుసుమిల్లి, చినసత్యం వీర్నపు, నాగరాజు నలజుల, వెంకట్ బొమ్మ, దిలీప్, సుధీర్ చింతమనేని, లక్ష్మి పాలేటి, దీప్తి సూర్యదేవర, రాజేష్ చుక్కపల్లి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.