ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. రైతు వేదిక వద్ద జెండా ఎగురేసి, బైక్ పై వెళ్తుండగా… దుండగులు ఆయన్ను వెంబడించి, హతమార్చారు. దీంతో అక్కడికక్కడే తమ్మినేని కృష్ణయ్య మరణించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలో 144 సెక్షన్ అమలు చేశారు. గ్రామంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సీపీఎం నేత కోటేశ్వరరావు సహా 7 మందిపై కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు.
నిందితుల కోసం నాలుగు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అయితే… ఆయన కుటుంబీకులు ఈ హత్యపై స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే… సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వర రావే హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. మరో వైపు తమ్మినేని కృష్ణయ్య అంత్య క్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తుమ్మలతో సహా ఇతర నాయకులు కూడా హాజరయ్యారు. కృష్ణయ్య అంత్యక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. అంతిమ యాత్రకు వెళ్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన అనంతరం గ్రామంలోకి పంపించారు.