టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కుమారుడు పృథ్వీతేజని దుండగులు బెదిరించారు. కత్తితో బెదిరించడమే కాదు… 75 వేల నగదును ఆయన దగ్గర మాయం చేసి, దుండగులు పరార్ అయ్యారు. హైదరాబాద్ లోని టోలీచౌకీ వద్ద దుండగులు కారును ఆపి, బలవంతంగా ఎక్కారు. నగరంలో కాసేపు అటూ ఇటూ తిప్పిన తర్వాత… ఎవ్వరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి, కారును ఆపారు. పృథ్వీతేజని కత్తితో బెదిరించి, 75 వేలు లాక్కున్నారు. మళ్లీ, కారును పంజాగుట్ట వరకూ తీసుకొచ్చి, అందులోంచి దిగి, దుండగులు పరారయ్యారు. దీంతో నామా కుమారుడు పృథ్వీతేజ పోలీసులను ఆశ్రయించాడు. వారిపై కేసులు పెట్టాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.