తెలంగాణ ఎంసెంట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ లో ఈ యేడాది లక్ష్మీసాయి రోహిత్ రెడ్డి ప్రథమ స్థానం సంపాదించగా… సాయి దీపిక సెకండ్ (శ్రీకాకుళం), కార్తికేయ (గుంటూరు), మూడో స్థానంలో నిలిచారు. ఇక.. అగ్రికల్చర్ విభాగంలో నేహా ప్రథమ స్థానం, (గుంటూరు), రోహిత్ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజుల్లోనే కౌన్సిలింగ్ కూడా వుంటుందని ప్రకటించారు.
