మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తుల సౌకర్యార్థమే ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. రద్దీ బాగా వుంటే.. మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. భక్తుల కోసం 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 19 వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అయితే… వీటికి ముందస్తు రిజర్వేషన్ కూడా వుంటుందన్నారు. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లడానికి MGBS, JBS, BHEL, IS SADAN,KPHB,దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులోకి వుండనున్నాయి.
ఏయే క్షేత్రానికి ఎన్నెన్ని బస్సులు నడుపుతున్నారో జాబితా ఇదీ….
శ్రీశైలం క్షేత్రానికి 578 ప్రత్యేక బస్సులు
వేములవాడ క్షేత్రానికి 481,
కీసరగుట్టకు 239 బస్సులు
ఏడుపాయలకు 497 బస్సులు
వేలాల క్షేత్రానికి 108 బస్సులు
కాళేశ్వరం క్షేత్రానికి 51
కొమురవెల్లికి 52 బస్సులు
కొండగట్టుకు 37,
అలంపూర్ కి 16,
రామప్పకు 15 ప్రత్యేక బస్సులు