TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వివేక్ ధన్కా వాదనలు వినిపించగా, ప్రభుత్వం పక్షాన ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. అయితే విచారణ సక్రమంగా జరగడం లేదన్న వాదనకు పిటిషనర్ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది.
అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువ ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11 కు వాయిదా వేసింది. అయితే.. ఇది రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్ అని, సిట్ సమగ్రంగా దర్యాప్తు చేస్తోందని ప్రభుత్వ ఏజీ కోర్టులో వాదించారు.