శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని TS RTC నిర్ణయించింది. తమ కార్గో పార్శిల్ కేంద్రాల్లో 116 రూపాయలు చెల్లించి, వివరాలు నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. కల్యాణోత్సవం తర్వాత సీతారాముల తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామన్నారు.
గత యేడాది కూడా ఆర్టీసీ ఈ విధానాన్ని అవలంబించి, సక్సెస్ అయ్యింది. తమ తమ వ్యక్తిగత పనులు, అక్కడి రద్దీ వల్ల అందరూ భద్రాద్రికి వెళ్లలేరు. దీంతో ఆర్టీసీయే మన ఇంటి వద్దకే తలంబ్రాలను తెచ్చిస్తోంది. గత యేడాది ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో… ఈ సారి కూడా ఆర్టీసీ ఈ ఆఫర్ ఇచ్చింది. దాదాపు 89 వేల మందికి సీతారాముల తలంబ్రాలను అందించింది ఆర్టీసీ. ఈ సీతారాముల తలంబ్రాలు కావాలనుకునే వారు 9177683134, 9154680020 నెంబర్లలో సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.