తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయంలో ఈ యేడాది సరికొత్త రికార్డు నెలకొల్పింది. జూలై మాసంలో గోవిందుడికి కాలసు వర్షం కురిసింది. ఈ నెల పూర్తవ్వకముందే అంటే.. ఈ నెల 21 తేదీ నాటికి టీటీడీకి 100 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ పేర్కొంది. ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారి. కొన్ని నెలలుగా భక్తులు ఎక్కువ సంఖ్యలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మొక్కులతో పాటు ముడుపులను కూడా భారీగానే సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకూ మే మాసంలో 130 కోట్ల రూపాయలే హుండీ ఆదాయంగా లభించింది. ఈ నెల ఇంకా ముగియలేదు కాబట్టి… మరో వారం రోజుల్లో హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశాలున్నాయని టీటీడీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
