తెలంగాణలో ఏ క్షణమైనా ఎన్నికలన్న పిడుగు పడొచ్చని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు బాంబు పేల్చారు. మరోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని తుమ్మల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తుమ్మల నాగేశ్వర రావు కింది స్థాయి కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు నియోజకవర్గంలో పూర్తి ప్రణాళికతో సిద్ధంగా వుండాలని సూచించారు. గత ఎన్నికల్లో కొన్ని తప్పులు జరిగాయని, ఈసారి అవి రిపీట్ కాకుండా చూసుకోవాలని తుమ్మల అన్నారు. మంత్రిగా వున్న సమయంలో తాను కేవలం డెవలప్ మెంట్ పైనే నడిచానని, దీంతో కార్యకర్తలను కలవ లేకపోయానని, ఈసారి పక్కగా చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు.