మంచిర్యాల జిల్లా చెన్నూర్ సోమన్ పల్లి గోదావరిలో చిక్కుకున్న ఇద్దరు మేకల కాపరుల్ని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మేకలను కాసేందుకు ఇద్దరు మేకల కాపర్లు వెళ్లి, వెనక్కి వచ్చే సమయంలో గోదావరి వరద పెరిగిపోయింది. దీంతో వాళ్లు అక్కడే చిక్కుకున్నారు. వరద పెరగడంతో వారిని కాపాడేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చేరింది.
దీంతో బాల్క సుమన్ మున్సిపల్ మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే మంత్రి అధికారులను అలర్ట్ చేసి, హెలికాప్టర్ ను పంపారు. హెలికాప్టర్ అక్కడికి చేరుకొని, వారిని జాగ్రత్తగా బయటకు తరలించారు. అయితే.. భారీ వర్షంలో కూడా ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.