ఎట్టకేలకు మహారాష్ట్ర రాజకీయాలు ముగింపు దశలో పడ్డాయి. అర్ధరాత్రి వరకూ మహారాష్ట్రలో హైడ్రామాయే నడిచింది. చివరికి… సుప్రీం కోర్ఠు బలపరీక్ష విషయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసేశారు. దీంతో ఓ అంకానికి తెరపడినట్లైంది. ఇక… తదుపరి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. రెండో అధ్యాయం ప్రారంభమవుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, డిప్యూటీ సీఎంగా ఏకనాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నారు.
రాజీనామా కంటే ముందు ఆయన సీఎంవో అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్ని రోజుల పాటు తనకు సహకరించినందుకు ధన్యవాదాలు ప్రకటించారు. ఇక.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. . దీంతో మహారాష్ట్రలో బలపరీక్ష అవసరమే లేకుండా పోయింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు ధన్యవాదాలు తెలిపారు. బలపరీక్ష విషయంలో సుప్రీం తీర్పు ఇచ్చిన 10 నిమిషాలకే ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని, ప్రజాస్వామ్యాన్ని తప్పనిసరిగా పాటిస్తానని పేర్కొన్నారు.
అయితే.. బాలా సాహెబ్ ఆశయాలను నెరవేర్చామని ఉద్ధవ్ పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని, అయితే తమ ప్రభుత్వానికి అద్రుష్టం కలిసి రాలేదని వాపోయారు. అయితే సొంత మనుషులే పరాయి వాళ్లు అయ్యారని, కేంద్రం కుట్రలు చేసిందని ఉద్ధవ్ ఆరోపించారు.