Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఈ 22న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

ఈ నెల 22న  తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీశోభకృత్‌నామ  సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ది నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి-భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Related Posts

Latest News Updates