హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ గా హాజరయ్యారు. ఇక… గవర్నర్ తమిళిసై, సీఎస్ శాంతి కుమారి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పతి నిలయంలోని నాలెడ్జి గ్యాలెరీ, కిచెన్ టన్నెల్ ను ప్రారంభించారు. వాటితో పాటు విజిటర్ ఫెసిలిటీస్ సెంటర్స్, పలు ఫౌండేషన్ స్టోన్స్, మెట్ల బావులను ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం చరిత్రకి సంబంధించిన పూర్తి విషయాలు నాలేడ్జ్ గ్యాలరీలో లభిస్తాయని పేర్కొన్నారు. గత నెలలో హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు.
