మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో ఉగాది మిలన్ నిర్వహించారు. శ్రీ శోభకృత్ నామ ఉగాది సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఈ ఉత్సవం నిర్వహించగా… ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు ఉప రాష్ట్రపతి ధన్కర్, లోకసభ స్పీకర్ ఓంబిర్లా, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను మోదీ తిలకరించారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా వెంకయ్య, ఆయన కుటుంబ సభ్యులు చక్కని కార్యక్రమం నిర్వహించారని మోదీ ప్రశంసించారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, తదితర కార్యక్రమాలు జరిగాయి.